RBI: ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు.. యథావిధిగా సేవలు!

  • ఆదివారంతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
  • ప్రభుత్వ లావాదేవీలకు ఆటంకం కాకుండా సేవలు
  • అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీచేసిన ఆర్‌బీఐ
All Banks Will Work On Sunday Says RBI

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎల్లుండి (ఆదివారం)తో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.

ఆర్బీఐ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డీబీఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్‌తోపాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి.

More Telugu News